నక్షత్రం - గుణ స్వభావం:

నక్షత్రం యొక్క అధిపతి రాశ్యాధిపతికన్నా ఎక్కువ ఫలితాన్ని  ఇస్తాడు, మొత్తం 27 నక్షత్రాలు ఉంటాయి.

ప్రతి నక్షత్రానికి ఒక గ్రహం అధిపతిగా ఉంటుంది. మనిషి పుట్టిన నక్షత్రాన్ని బట్టి గ్రహ శాంతులు కూడా ఉంటాయి. శాస్త్రోక్తంగా వాటిని నివారణ చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు.

1.అశ్విని నక్షత్రం :

ఒకటవ పాదంలో శిశు జననం తండ్రికి , శిశువుకు దోషం

ఈ దోష పరిహారానికి ( నివారణకు ) హోమ సహిత  శాంతి జరపాలి , మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం , జననకాల నక్షత్ర , నవగ్రహ జపములు , నవగ్రహ దానములతో పాటు  సువర్ణ దానము చేయవలెను మరియు రెండవ, మూడవ, నాలుగవ పాదములలో జన్మించిన వారికి దోషం కాకపోయినా నక్షత్రం దుష్టప్రభావం కాబట్టి సామాన్య శాంతి ఆద్య వీక్షణము  ( శిశువు యొక్క ముఖమును మంత్రయుక్తముగా త్రండి చూడడాన్ని ఆద్య వీక్షణము అంటారు  ) జరిపించాలి.

గుణ స్వభావం :

ఈ నక్షత్రమున పురుషుడు అయినచో సౌందర్యము, శౌర్యము , వినయ విధేయతలు కలవాడును, ధనార్జనాపరుడు , కీర్తివంతుడు దీర్ఘదేహ ధారుడ్యము కలవాడును, స్త్రీ  జన్మించినచో వ్యవహార జ్ఞానము కలది , అహంకారము కలది యగును.

2.భరణి నక్షత్రం:

ఒకటి రెండు, నాలుగు పాదములలో జన్మించినచో  దోషం కాదు, తృతీయ పాదమందు పుత్రుడు జన్మిస్తే  ఆ శిశువుకు, తండ్రికి ఆడ శిశువు జన్మిస్తే శిశువునకు, తల్లికి దోషము . దోషము లేను ఒకటి  రెండు , నాలుగవ పాదములలో జన్మించినను నక్షత్ర ప్రభావము దుష్టము కావున హోమ సహిత ఆద్య వీక్షణ శాంతి, నవగ్రహ జప, నవగ్రహ దానములు జరిపించాలి

 గుణ స్వభావము :

ఈ నక్షత్రమున పుట్టిన పుత్రుడు విద్యార్థనా పరుడు , ఆరోగ్య వంతుడు , నిష్ఠగలవాడు , సత్యవాది యగును , కార్యదీక్ష ఇతనికి మెండుగా ఉండును, స్త్రీ జన్మించినచో ఎక్కువగా సుఖపడును, హాస్య ప్రియత్వము కలది , కన్నవారియెడ  గౌరవాదరములు కలది యగును.

3. కృతిక నక్షత్రం:


ఈ నక్షత్ర తృతీయ పాదమున పుత్ర జననమునకు పితృగండము, స్ర్తీ జననమునకు మాతృగడము కలుగును. మిగిలిన మూడు పాదములకు జన్మించిన ఏ శిశువుకైననూ సామాన్య శాంతి, ఆద్యవీక్షణముతో పాటు నవగ్రహ దానము జరిపించాలి.

గుణ స్వభావం :

ఈ నక్షత్రమున పుటిన పురుషుడు గంభీర స్వభావి, న్యాయశాస్త్ర కోవిదుడు , ప్రజానాయక లక్షణములు కలవాడు, స్వాభిమాని అవుతాడు, స్ర్తీ జన్మించినచో కీర్తివంతురాలు, కాంతిమతి, క్రోథ గుణము కలది. శ్లేష్మసహిత శరీరి అవుతుంది.

4.రోహిణి నక్షత్రం:


మొదటి పాదము, మూడవ పాదములోను, జననం వల్ల తల్లికి, మేనమామకు గండము. రెండవ పాదములో జననం అయితే తల్లీ మేనమాలతో పాటు తండ్రికి కూడ గండము. నాల్గవ పాదములో జననం వల్ల ఒక్క మేనమామకు మాత్రమే గండము కలదు. అందుచే ఏ పాదమందు జన్మించునాను హోమ పూర్వక శాంతి, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము,  నక్షత్ర శాంతి, నవగ్రహ జప, దానములు, సువర్ణ  దానము చేయాలి.

గుణ స్వభావం :

ఈ నక్షత్రమందు జన్మించిన పురుషుడు స్ఫురద్రూపి, స్థిరచిత్తుడు, ఆత్మాభిమాని, సుఖజీవి కాగలడు. సామర్థ్యము, తేజస్సు , రతి ప్రియత్వము , ఇతని ప్రత్యక లక్షణములు , స్త్రీ అయినచో పుత్ర పౌత్రాభివృద్ధి కలది, రూపవతి, కీర్తిమంతురాలు అయి చిరకాలము జీవించగలది యగును.

5. మృగశిర నక్షత్రం :

ఈ నక్షత్రము సంపూర్ణముగా శుభప్రదము

గుణ స్వభావము:

మగశిశువు అయినచో ధనవంతుడు , ఉత్సాహి , విజయుడు, బృహత్ కార్య నిర్వాహకుడు , పవిత్రుడు, వేదజ్ఞాని కాగలడు. స్త్రీ జన్మిచినచో సౌందర్యవతి , సంతానము కలది , సమాజంలో కీర్తి పేరు ప్రఖ్యాతలు కలది, ధార్మిక కార్యములు నెరవేర్చునది, పుత్ర సంతానవతి కాగలదు.

Copyright © 2019 astroshivam.in All rights reserved.