ఏకముఖి రుద్రాక్ష :

దీనిని సాక్షాత్తు శివ స్వరూపంగా భావిస్తారు. అది దేవత సూర్యుడు. ఇది లభించడం చాల కష్టం , అర్ధచంద్రాకారం లో ఉండే ఈ రుద్రాక్షను ధరించడం వల్ల ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది, ఆధ్యాత్మిక జ్ఞానంలో హిమాలయ శిఖరం అంత ఎత్తు ఎదుగుతారు , మనోవికాసం , పరతత్వ జ్ఞానం పొందుతారు. 

ద్విముఖి రుద్రాక్ష:

పార్వతి పరమేశ్వరుల స్వరూపముగా అర్ధనారీశ్వరుల తత్వంగా భావిస్తారు. అందుకే దీనిని గౌరీశంకర రుద్రాక్షగా పిలుస్తారు , దీని అది దేవత చంద్రుడు. దేవి స్వరూపంగా భావిస్తారు , చంద్ర గ్రహ దోష నివృత్తికి దీనిని ధరించవచ్చు. ఏకాగ్రత కలిగి చేసే పనిలో ఇబ్బందులు తొలగి మనశ్శాంతి లభిస్తుంది  వ్యాపార అభివృద్ధి , సంతాన సౌఖ్యం , వ్యవహార జయం  , సర్వాభీష్ట సిద్ది కలుగును.

త్రిముఖి రుద్రాక్ష:

దీనిని త్రికాలఙ్ఞ రుద్రాక్షగా పిలుస్తారు. సూర్య, చంద్ర, అగ్ని అను నేత్రములు కలవాడే త్రికాలజ్ఞుడు  అనగా పాపాలను భస్మం చేసేది . ఈ రుద్రాక్ష అధిపతి కుజుడు.  కుజదోష ప్రభావం ఉన్నవారు ఈ రుద్రాక్షను ధరించటం మంచిది. దీర్ఘాయువు , స్త్రీ హత్య పాపనివారిని , సర్వ విద్య ప్రదాయిని , సర్వరోగ నివారిణి గా ఈ రుద్రాక్షని భావిస్తారు, పూర్వజన్మ పాప నివృత్తి  సర్వ విద్యలలో అభ్యున్నతి , విష ప్రయోగాల నుండి విముక్తి పొందుటకు త్రిముఖి రుద్రాక్ష ఉపయోగపండుతుంది.

చతుర్ముఖి రుద్రాక్ష :

నాలుగు వేదాల స్వరూపం. బ్రహ్మకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ధర్మార్థ కామ మోక్షాదులు అను నాలుగు పురుషార్ధములు . వీటిని అనుగ్రహించేవాడు శివుడు, ఇవి చేతుర్వేదాల నుండు వెలుబడ్డాయి  అది దేవత బుధుడు, పరబ్రహ్మ రుద్రుడిచే ఉపదేశించబడి బ్రహ్మ చతుర్ముఖలచే  పారాయణం చేయబడినది కాబట్టి చేతుర్వేదాలు అయినవి. ఈ పరబ్రహ్మ రుద్రుని స్వరూపమే చతుర్ముఖి రుద్రాక్ష. ఈ రుద్రాక్ష ధరిస్తే బ్రహ్మ అనుగ్రహం చేత నిత్యా జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, బుద్ది వికాసం , జ్ఞాపక శక్తి , వ్యవహార జ్ఞానం కలుగుతుంది.

పంచముఖి రుద్రాక్ష:

ఇది కాలాగ్ని రుద్ర స్వరూపం, పంచ ముఖ బ్రహ్మ స్వారూపము. పృథివీ, వాయువు , జలము, ఆకాశము, అగ్ని వీటిని పంచభూతాలు అంటాము. మహాశివుడి పంచముఖాలు : సద్యోజాతం , ఈశాన,అఘోర , వామదేవ , తత్పురుష అను పంచముకల ను0డి  పంచ కర్మేంద్రియాలు , పంచ జ్ఞానేంద్రియాలు ఏర్పడ్డాయి. పంచ మహా శక్తుల ప్రతీక ఈ పంచముఖి రుద్రాక్ష, దీనికి అధిదేవత గురువు సంగం లో

గౌరవం , ఉద్యోగం, ఎద్యోగం లో పదోన్నతి , రాజకీయ యోగం , బిజినెస్ లో ఎక్కువగా సక్సెస్ రావడానికి, గుండె జబ్బులు , మలబద్ధకం పోవడానికి పంచముఖి ఎక్కువ ఉపయోగపడుతుంది.

షణ్ముఖి రుద్రాక్ష :

ఈ రుద్రాక్ష షణ్ముఖుడయిన సుబ్రమణ్యస్వామి ప్రతీకగా భావిస్తారు. అది దేవత శుక్రుడు.  కుజ దోష నివృత్తికి ఒక సంజీవినిగా ఈ రుద్రాక్ష పనిచేస్తుంది. లలిత కళలు, సుఖ భోగాలు , సంతోషము , రుణ బాధ నుండి విముక్తి , కుంటుంబ సౌఖ్యం మొదలగు వాటికి ఈ రుద్రాక్ష చాల ఉపయోగపడుతుంది.

సప్తముఖి రుద్రాక్ష:

సప్తకాల  సర్పాలు , సప్త మాతృకలు, సప్త ఋషుల స్వరూపమే ఈ రుద్రాక్ష.  ఈ సప్తముఖ రుద్రాక్ష ఏలినాటి శని, అష్టమ శని, అర్దాష్టమ శని జరుగుతున్నపుడు మరియు శని మహర్దశ జరుగుతున్నపుడు ధరించడం చాల మంచిది. కాలసర్ప దోషం ఉన్నవాళ్లు ధరించవచ్చు, ఎప్పుడు నష్టాలు , కుటుంబ అనారోగ్యం , ఉద్యోగ భంగం , మానసిక ప్రశాంతత  లేని వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.


అష్టముఖి రుద్రాక్ష:

వినాయక స్వరూపముగా భావిస్తారు , అది దేవత రాహువు. రాహుగ్రహం అనుకూలంగా లేనపుడు , రాహు దశ నడుస్తున్నపుడు దారిచండి 
కార్యానుకూలత, అన్నిట్లో విజయం సాదించేందుకు ఈ రుద్రాక్ష ధరించవచ్చు రాహుగ్రహం అనుకూలంగా లేనపుడు కుటుంబ కలహాలు, విదేశీ యన ఇబ్బంది, భోజన సుకం లేకవటం, దొంగల వల్ల బాధ , సంతానం వల్ల బాధ, అత్యాశలు , వక్రమార్గా సంపాదన , దుస్వప్నాలు వీటికి కారణం రాహువు ఈ దోషాలు అన్ని పోవడానికి అష్టముఖి చాల ఉపయోగకరం.

నవముఖి రుద్రాక్ష:

రుద్రంశ సంభూతుడైన కాల భైరవ, నవగ్రహాల స్వరూపం , నవశక్తులు అంటే విద్యాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, శాంతశక్తి, వామశక్తి, జ్యేష్ఠాశక్తి, రేధిశక్తి, అంగశక్తి, పశ్వంతీ. నవ దుర్గాలకి ప్రతీక, ఆధిపత్య గ్రాహం కేతువు , కేతువు జ్ఞానానికి, మోక్షానికి కారకుడు , మృత్యుభయం  

తొలగడానికి , విశేష దైవ శక్తులు పొందడానికి ఈ రుద్రాక్ష చాల ఉపయోగపడుతుంది.

దశముఖి రుద్రాక్ష:

దశావతార పురుషుడయినా సంపూర్ణ విష్ణు మూర్తి స్వరూపం, జనార్ధనుడికి ప్రతీక. అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం

కలుగుతుంది.అధ దేవత ధర్మ దేవత , ఈ రుద్రాక్ష ధరించడం వల్ల గ్రహ శాంతి,భూత, ప్రేత, పిశాలనుండి పీడ తొలగిపోతుంది, చేదు ప్రయోగాల నుండి విముక్తి మోసాలు, కుట్రలు వంటి వాటి నుండి దూరం  అవుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

ఏకాదశ రుద్రాక్ష:

ఏకాదశ రుద్రుల స్వరూపమే ఈ రుద్రాక్ష , అధిదేవత రుద్రుడు. ఈ రుద్రాక్ష ధారణ వల్ల వేయు గో దానాల పుణ్యఫలదం,  కుటుంబ సౌఖ్యం, సౌభాగ్యం, జ్ఞానం , ధ్యాన ఏకాగ్రత కలుగుతుంది.

ద్వాదశ రుద్రాక్ష: 

ఈ రుద్రాక్ష మహా విష్ణువు స్వరూపం, అది దేవత సూర్యభగవానుడు. ఈ  రుద్రాక్ష ధారణ వల్ల మహా శక్తి సంపన్నులు , అద్బుతమయిన తేజో సంపన్నులు అవుతారు, ముఖ్యంగా రాజకీయ రంగం, ప్రజాసేవ చేయాలనుకునే నాయకులకి ఇది చాల ఉపయోగం చర్మ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉన్నపుడు ఈ రుద్రాక్ష చాల ఉపయోగకరం .

త్రయోదశముఖి రుద్రాక్ష :

ఈ రుద్రాక్ష కామధేనువుడు అయినా మన్మథుని స్వరూపం , ఈ రుద్రాక్షకి అధిదేవత ఇంద్రుడు , అదృష్ట జాతకులకు మాత్రమే ఇది లభిస్తుంది 
వశీకరణ శక్తి, సమస్త కోర్కెలు , మానవాతీత శక్తులు కలగడానికి ఈ రుద్రాక్ష ఉపయోగపడుతుంది.

చతుర్దశముఖి రుద్రాక్ష :

ఇది చాల అరుదుగా లభిస్తుంది , ఈ రుద్రాక్ష శివాంశ సంభూతుడు ఆయన ,హనుమంతుని స్వరూపం, పార్వతీ పరమేశ్వరులే దీనికి ఆది దేవతులు కాబట్టి ఈ రుద్రాక్ష దరిచినవాళ్లు నిత్య సంతుష్టులు అయి , శివ స్వరూపులు అవుతారు.

రుద్రాక్ష - విశిష్టతలు -రకాలు

మహాశివుడి అనుగ్రహానికి ప్రతిరూపకమే రుద్రాక్షలు 

రుద్రాక్షలు ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేక లక్షణం ఉంది.

వీటిని ధరించటం వల్ల  శుభ ఫలితాలను పొందుతారు.

Copyright © 2019 astroshivam.in All rights reserved.